పహల్గాం దాడిపై చర్చించేందుకు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ నేడు అత్యవసరంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ ''ఇలాంటి దాడులు గతంలో చాలా చూశాం. కానీ, బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. క్షమాపణలు చెప్పేందుకు నా వద్ద మాటలు కరవయ్యాయి. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రహోదాను డిమాండ్ చేయాలి. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాము. భవిష్యత్తులో కూడా అడుగుతాము. కానీ, 26 మంది చనిపోయారు. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే మిలిటెన్సీ, ఉగ్రవాదం అంతమవుతాయి. ఇది దానికి ఆరంభం. ఈ ఉద్యమానికి హాని కలిగించేది ఏదీ మాట్లాడకూడదు, చేయకూడదు. మేము మిలిటెన్సీని తుపాకులతో అదుపు చేయగలం. కానీ, మాకు ప్రజల మద్దతు అవసరం'' అని అబ్దుల్లా అసెంబ్లీలో పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, పర్యాటకశాఖ మంత్రిగా వారిని కాపాడలేకపోయానన్నారు.
క్షమాపణలు చెప్పేందుకు నా వద్ద మాటలు కరవయ్యాయి : ఒమర్ అబ్దుల్లా
April 28, 2025
0
Tags