తమిళనాడు ప్రభుత్వంతో డిక్సన్‌ టెక్నాలజీస్‌ అవగాహన ఒప్పందం

Telugu Lo Computer
0

మిళనాడులో ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల సంస్థ డిక్సన్ టెక్నాలజీస్ రూ.1,000 కోట్లతో పర్సనల్‌ కంప్యూటర్స్‌, ల్యాప్‌టాప్‌లు తయారీకి సంబంధించిన యూనిట్ ఏర్పాటు చేయనుంది. తమిళనాడు ప్రభుత్వంతో ఈ రోజు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసిందికాంచీపురం జిల్లాలోని ఒరగడం వద్ద ఏర్పాటు చేయనున్న ఈ కర్మాగారం వల్ల ఈ ప్రాంతంలో 5,000 ఉద్యోగులకు ఉపాధి కలగనుందని అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఒప్పందం ప్రకారం, డిక్సన్ టెక్నాలజీస్ చెన్నైకు దక్షిణంగా 45 కి.మీ దూరంలో ఉన్న ఒరగడంలోని ఇండోస్పేస్ ఇండస్ట్రియల్ పార్క్‌లో కంప్యూటర్స్‌కు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేయనుంది. ఈ కర్మాగారం ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్ల ఉత్పత్తితో పాటు ఇతర కంపెనీలకు ఎలక్ట్రానిక్ తయారీ సేవలను కూడా అందిస్తుంది. ఈ రోజు సచివాలయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, పరిశ్రమల మంత్రి టి.ఆర్.బి. రాజా సమక్షంలో డిక్సన్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ వాచానీ, వైస్ ప్రెసిడెంట్ పృథ్వీ వాచానీ నేతృత్వంలోని ఉన్నతాధికారులు తమిళనాడు నోడల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ గైడెన్స్ ఎండీ & సీఇఓ డేరెజ్ అహ్మద్‌తో పత్రాలను మార్పిడి చేసుకున్నారు. 1993లో స్థాపించబడిన డిక్సన్ టెక్నాలజీస్ శామ్‌సంగ్, షియామి, మోటరోలా, boAt, పానాసోనిక్, టీసీఎల్ టెక్నాలజీస్, వన్‌ప్లస్ వంటి వివిధ కంపెనీలకు కాంట్రాక్ట్ తయారీ సేవలను అందిస్తోందని ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)