ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వరకూ 104 కిలోమీటర్ల తిరుపతి-పాకాల-కాట్పడి సింగిల్ రైల్వే లేన్ సెక్షన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని కోసం రూ.1,332 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారంనాడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు. తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య సుమారు రూ.1,332 కోట్ల ఖర్చుతో 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందువల్ల 400 గ్రామాలు, 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి కనెక్టివిటీ పెరగడంతో పాటు, ఇతర ప్రముఖ ప్రాంతాలైన శ్రీకాళహస్తి, కానిపాక, చంద్రగిరి ఫోర్ట్‌కు రైలు కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. దీంతో పర్యాటకులు కూడా పెరుగుతారని చెప్పారు. ఏడాదికి నాలుగు మిలియన్ టన్నుల సరకు రవాణా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో 35 లక్షల పనిదినాలతో నిరుద్యోగుల ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు. ప్రధానమంత్రి 'ఆత్మనిర్భర్', 'న్యూ ఇండియా' విజన్‌కు ఈ తాజా నిర్ణయం మరింత ఊతమిస్తుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
తిరుపతి-పాకాల-కాట్పడి రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం !
April 09, 2025
0
Tags