సికింద్రాబాద్‌లో ఒక మహిళ తన ఫ్లాట్‌ను అద్దెకు ఇవ్వాలని ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చింది. క్వికర్ యాప్‌లో పెట్టిన ఆ ప్రకటన చూసి ఓ కేటుగాడు ఫోన్ చేసి తాను ఆర్మీ అధికారిని అని చెప్పి నమ్మబలికాడు. ఫ్లాట్ చాలా బాగుందని, అద్దెకు తీసుకుంటానని చెప్పాడు. ఆర్మీ అకౌంటెంట్ త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తాడని చెప్పి మరింత నమ్మకం కలిగించాడు. ఆర్మీ చెల్లింపులు రివర్స్ మోడ్‌లో ఉంటాయని, మొదట మీరు కొంత డబ్బు పంపిస్తే, తాము చెల్లించాల్సిన అద్దెతో కలిపి మీ ఖాతాలో వేస్తామని మాయమాటలు చెప్పాడు. ఆ మహిళ వారి మాటలు నమ్మింది. విడతల వారీగా లక్షా 31 వేల రూపాయలు వారి ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసింది. డబ్బులు వెళ్లిన కాసేపటికే ఆ “ఆర్మీ అధికారి” ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. అప్పుడు ఆ మహిళకు తాను మోసపోయానని అర్థమైంది. లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆర్మీ అధికారినని లక్షన్నర కాజేసిన సైబర్ కేటుగాడు !
April 30, 2025
0
Tags