కోల్‌కతా అగ్నిప్రమాదలో 14 మంది దుర్మరణం

Telugu Lo Computer
0


కోల్‌కతాలోని ఫల్‌పట్టి ఫిషర్‌మెన్ ఏరియాలోని ఓ హోటల్‌లో మంగళవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 14 మంది మరణించారు. ఈ ఘోర ప్రమాదం 'రితురాజ్ హోటల్' వద్ద రాత్రి 8:15 గంటల ప్రాంతంలో జరిగింది. ఇప్పటి వరకు 14 మృతదేహాలను వెలికి తీశామని, చాలా మందిని రక్షించి సురక్షితంగా బయటకు తీశామని కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి తెచ్చామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, దీనిపై విచారణ జరుపుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని వర్మ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)