హైదరాబాద్ నగర శివారులో బర్త్ డే పార్టీ ముసుగులో జరుగుతున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ రెడ్డి వివరాల ప్రకారం బోరబండ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహ్మద్ లుఖ్మార్ సిటీ శివారులో తన బర్త్ డే వేడుకలు ప్లాన్చేశాడు. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎత్ బార్ పల్లిలోని హాలీడే హోం ఫామ్ హౌస్కుమంగళవారం సాయంత్రం వచ్చాడు. బర్త్ డే ముసుగులో ముజ్రా పార్టీని ఏర్పాటు చేసి, పశ్చిమ బెంగాల్ తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది యువతులను రప్పించాడు. అనంతరం హైదరాబాద్ కు చెందిన తన స్నేహితులను పిలిపించి పార్టీ ఇచ్చాడు. వీరందరికీ మద్యం, గంజాయి మత్తెక్కించి న్యూడ్ డ్యాన్స్‌లు చేయించాడు. దీనిపై రాజేంద్రనగర్, ఎస్ఓటీ పోలీసులకు పక్కా సమాచారం రావడంతో మొయినాబాద్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాడి చేశారు. అప్పటికే గంజాయి మత్తులో తూగుతున్న యువతీ యువకులను అరెస్ట్ చేసి, పీఎస్‌కు తరలించారు. నిందితుల నుంచి మద్యం బాటిళ్లతోపాటు 70 గ్రాముల గంజాయి, 15 కండోమ్ ప్యాకెట్లు, రూ.18 వేల నగదు, ఆరు వాహనాలను సీజ్ చేశారు. వ్యాపారి మహ్మద్ లుక్మార్ తో ఫామ్ హౌస్ ఓనర్ అబ్దుల్ బీన్ పై కేసు నమోదు చేశారు. నిందితులను పీఎస్‌కు తీసుకొచ్చిన తరువాత దర్యాప్తులో భాగంగా సీఐ పవన్ కుమార్ తన సిబ్బందితో కలిసి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు.
హైదరాబాద్ నగర శివారులో బర్త్‌డే ముసుగులో ముజ్రా పార్టీ !
April 10, 2025
0
Tags