మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలో పిపారియాకు చెందిన భగత్ సింగ్ ప్రభుత్వ కాలేజీ గెస్ట్ లెక్చరర్ తాను దిద్దాల్సిన సమాధాన పత్రాలను ప్యూన్‌కు అప్పగించాడు. దీంతో అతడు వాటిని మూల్యాంకనం చేశాడు. ఈ విషయం తెలిసి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఠాకూర్‌దాస్ నాగవంశీని కలిసి ఫిర్యాదు చేశారు. యువజన వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ ఈ అంశంపై స్పందించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న ఆ కాలేజీ ప్రిన్సిపాల్, నోడల్ అధికారిని సస్పెండ్ చేశారు. సమాధాన పత్రాలను కాలేజీ ప్యూన్ మూల్యాంకనం చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసిన ప్యూన్ : సోషల్ మీడియాలో వీడియో వైరల్
April 09, 2025
0
Tags