తెలంగాణ లో వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆమె కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులుతోపాటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ అధికారులతో మేథోమథన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ వచ్చే ఏడాది పంచాయతీ రాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంల వినియోగంపై పరిశీలిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో గూడూరు ఆర్డీవో రాఘవేంద్రమీనా, అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి, తిరుపతి మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ అమరయ్య పాల్గొన్నారు.
తెలంగాణ లో వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు ?
April 11, 2025
0
Tags