పవన్ కల్యాణ్‌తో తమిళనాడు నేత రాధాకృష్ణన్ భేటీ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో శనివారం తమిళనాడుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, రచయిత, మరియు పర్యావరణ ఉద్యమ నాయకుడు కె.ఎస్. రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ సమయంలో భాషా సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, తమిళనాడు రాజకీయాల పరిస్థితి వంటి అనేక అంశాలపై చర్చలు జరిపారు. భేటీ సందర్భంగా కె.ఎస్. రాధాకృష్ణన్ తన పర్యావరణ పోరాటాల గురించి పవన్ కల్యాణ్‌కు వివరించారు. ముఖ్యంగా తమిళనాడులోని రైతాంగ పోరాటం పై తన పాత్రను వివరించడంతో పాటు, కన్నగి ఆలయం నిర్మాణానికి సంబంధించి కేరళ ప్రభుత్వంతో సాగిన న్యాయ పోరాటం గురించి వివరించారు. పశ్చిమ కనుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో తీసుకున్న చట్టపరమైన చర్యల గురించి వివరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి పవన్ కల్యాణ్‌ను ప్రభావితం చేసింది. రాధాకృష్ణన్, తన రాజకీయ జీవితంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, ప్రముఖ సమాజ సేవకుడు నెడుమారన్, అలాగే ఈవీకే సంపత్ వంటి ప్రముఖులతో తన సన్నిహిత అనుబంధాన్ని కూడా పవన్ కల్యాణ్‌కు వివరించారు. ఈ అనుబంధం ద్వారా తాను ఎలా ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నానో తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ను సత్కరించి 'కరుంగాలి కంబు'ను రాధాకృష్ణన్ బహుకరించారు. కరుంగాలి కంబుకి ఇరువైపులా పవిత్రమైన పంచలోహాలతో కూడిన క్యాప్స్ ఉంటాయని ఆయన తెలిపారు. కాగా, ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)