హైదాబాద్ పరిధిలోని గాజులరామారంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా కత్తితో నరికి చంపింది.. తర్వాత ఆమె భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన మానసిక స్థితి గురించి నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆ తర్వాత ఈ దారుణానికి పాల్పడింది. మృతులు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలాజీ లేఅవుట్ సహస్ర హైట్స్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న తేజస్విని రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి దంపతులు నివసిస్తున్నారు. వారికి అర్షిత్ రెడ్డి (6), ఆశిష్ రెడ్డి (8) అనే ఇద్దరు కుమారులున్నారు. మానసిక స్థితి బాలేకపోవడంతో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో తేజస్విని తన ఇద్దరు కుమారులను కొబ్బరి బొండాలు కొట్టే కొడవలితో మెడపై నరికింది. ఈ ఘటనలో ఆశిష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, అర్షిత్ రెడ్డిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలను సేకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో పోలీసులు నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో అనారోగ్య కారణాల వలన ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు తేజస్విని రాసిందని చెబుతున్నారు. అలాగే తేజస్విని రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయని, తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పలు కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు పిల్లలను ఆత్మహత్య చేసుకున్న తల్లి !
April 18, 2025
0
Tags