సీజీవో టవర్స్‌పై నుంచి దూకి ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్‌ జయలక్ష్మి ఆత్మహత్య !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని గాంధీనగర్‌లో ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్‌ జయలక్ష్మి సీజీవో టవర్స్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. భవనంపై నుంచి దూకి, తీవ్ర గాయాలతో పడివున్న ఆమెను స్థానికులు గుర్తించి ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించారు. జయలక్ష్మి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనారోగ్య కారణాల వల్లనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)