ఆరవ బిమ్ స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ థాయిలాండ్ కు బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత ఆయన శ్రీలంకకు కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకేను కలవనున్నారు. దిసానాయకే అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆ దేశాన్ని మోడీ సందర్శించడం ఇదే తొలిసారి. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి పేటోంగ్టార్న్ షినవత్రా, థాయ్ నాయకత్వంతో మోడీ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి సంస్కృతి, తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక ఆలోచనలు వంటి బలమైన పునాదులపై ఆధారపడిన వారి దీర్ఘకాల చారిత్రక సంబంధాలను మెరుగుపరుచుకోవాలని లక్ష్యంతో మోడీ ఈ పర్యటన చేయనున్నట్లు పేర్కొన్నారు. గత దశాబ్దంలో బంగాళాఖాతం ప్రాంతంలో ప్రాంతీయ అభివృద్ధి, కనెక్టివిటీ మరియు ఆర్థిక పురోగతిని ప్రోత్సహించడానికి బిమ్స్టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) ఒక ముఖ్యమైన వేదికగా మోడీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భౌగోళికంగా భారతదేశం ఈశాన్య ప్రాంతం బిమ్ స్టెక్ కు గుండెకాయగా ఉందని ప్రధానమంత్రి మోడీ పేర్కొన్నారు. 'రాబోయే మూడు రోజుల్లో నేను థాయిలాండ్, శ్రీలంక దేశాలను సందర్శించి, ఆ దేశాలు, బిమ్ స్టెక్ దేశాలతో భారతదేశ సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటాను. ఈరోజు సాయంత్రం బ్యాంకాక్ లో నేను ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్ షినవత్రాను కలుస్తాను. భారతదేశం-థాయిలాండ్ స్నేహం గురించి పూర్తి స్థాయిలో చర్చిస్తాను. రేపు నేను బిమ్ స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటాను. థాయిలాండ్ రాజు మహా వజిరాలాంగ్ కార్ న్ను కూడా కలుస్తాను.' అని ప్రధాని మోడీ ఎక్స్ లో పోస్టు చేశారు.
బిమ్ స్టెక్ శిఖరాగ్ర సమావేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ
April 03, 2025
0
Tags