హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్ట షాహీనగర్‌లో నివాసం ఉంటున్న అమీన్ అహ్మద్ అన్సారీ తండ్రి టీఎస్ ఆర్టీసీ కాచిగూడ డిపోలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేశారు.ఆయన అనారోగ్యంతో 2021లో మరణించగా కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తిచేసిన అన్సారీకి మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా ఉద్యోగం ఇచ్చారు. అతడు ఏడడుగుల పొడవు ఉండటంతో విధులు నిర్వర్తించడం సవాల్‌గా మారింది. బస్సుల్లో రోజూ సగటున ఐదు ట్రిప్పుల్లో 10 గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోంది. 6 అడుగుల 4 అంగుళాలు ఎత్తుండే బస్సు లోపల 214 సెం.మీ. పొడవున్న తాను గంటల తరబడి తల వంచి ప్రయాణిస్తుండటంతో మెడ, వెన్నునొప్పి, నిద్రలేమితో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్సారీ వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ప్రయాణికులు సూచిస్తున్నారు.
టీఎస్ ఆర్టీసీ బస్సులో ఏడడుగుల కండక్టర్ అగచాట్లు !
April 05, 2025
0
Tags