క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో విద్యార్థి మృతి

Telugu Lo Computer
0


తెలంగాణ లోని మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్‌ తమ కళాశాల మైదానం క్రికెట్‌ ఆడుతూ గుండెనొప్పితో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. కళాశాల విద్యార్థుల కథనం ప్రకారం వినయ్‌, ఇతర స్నేహితులు శుక్రవారం సాయంత్రం కళాశాల మైదానంలో క్రికెట్‌ ఆడారు. ఏమైందో తెలియదు కానీ ఆటలో భాగంగా ఫీల్డింగ్‌ చేస్తున్న వినయ్‌ ఛాతీలో నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు, స్నేహితులు వినయ్‌ను హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ, వినయ్‌ అప్పటికే మరణించాడని అక్కడి వైద్యులు నిర్ధారించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)