ఆరు నెలల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ !

Telugu Lo Computer
0


భారత్ సంచార్ నిగమ్‌ లిమిటెడ్ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకోవస్తుంది. తాజాగా మరో ప్లాన్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ డేటా కూడా ఎక్కువ పొందుతారు. అయితే దీని ధర చూస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే. సాధారణంగా బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్యాక్స్‌ ఉంటాయి. అయితే ఈ ప్లాన్ ఆరు నెలల వ్యాలిడిటీ ఉంటుంది. దీంతోపాటు అనేక ఇతర బెనిఫిట్స్ కూడా పొందుతారు. ఈ 180 రోజుల ప్లాన్ లో ధర రూ.897. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ ఫ్రీ కాలింగ్‌తో పాటు రోమింగ్ కూడా ఫ్రీ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏ నెట్‌వర్క్ అయినా ఉచితంగా కాల్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ లో ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతారు. మొత్తంగా ఈ ప్లాన్‌లో హై స్పీడ్ నెట్ కూడా ఉంటుంది. అంటే ప్రతిరోజు డైలీ డేటా లిమిట్ కూడా లేదు. యూజర్లు ఎంత నెట్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ మొత్తం ఉపయోగించవచ్చు. అయితే పూర్తిగా డేటా అయిపోయినా కానీ 40 కేబీపీఎస్ నెట్ పొందుతారు. అలాగే రూ.151 ప్లాన్ లో వ్యాలిడిటీ 30 రోజులపాటు ఉంటుంది. ఇందులో 40 జీబీ డేటా పొందుతారు. అయితే ఈ ప్లాన్‌లో మీరు అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లు వంటివి పొందలేరు. ఇది కేవలం డేటా వోచర్ మాత్రమే. అంటే ఇప్పటికే మీ దగ్గర బేస్ ప్లాన్‌ యాక్టివ్ లో ఉంటే ఈ డేటా ప్లాన్ తో మీరు రీచార్జ్ చేసుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)