తహవ్వుర్‌ రాణాను 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీ అనుమతించిన కోర్టు !

Telugu Lo Computer
0


ముంబయి ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణాను 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. గురువారం అర్ధరాత్రి ఎన్‌ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు. సీనియర్‌ న్యాయవాది దయాన్‌ కృష్ణన్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నరేందర్‌ మాన్‌ ఎన్‌ఐఏ తరఫున కోర్టులో వాదనలను వినిపించారు. రాణా తరఫున దిల్లీ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ న్యాయవాది పీయూష్‌ సచ్‌దేవా వాదించారు. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి చందర్‌జిత్‌ సింగ్‌ వాదనలను విన్నారు. రాణాను 20 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని ఎన్‌ఐఏ కోరగా.. 18 రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. ఈ సందర్భంగా ఎన్‌ఐఏ కార్యాలయం, పటియాలా హౌస్‌ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)