బ్రిటన్ కు చెందిన ఓ మాజీ గూఢచారిపై పరువునష్టం దావా వేయాలని ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లండన్ హైకోర్టు జరిమానా విధించింది. ఆరోపణలను నిరూపించడంలో విఫలమైన కారణంగా న్యాయ ఖర్చుల కింద ట్రంప్ 7,41,000 డాలర్లు చెల్లించాల్సిందిగా తీర్పు ఇచ్చింది. యూకే గూఢచార సంస్థ ఎంఐ6 మాజీ అధికారి క్రిస్టోఫర్ స్టీల్ 2017లో ట్రంప్‌పై సంచలన పత్రాన్ని విడుదల చేశారు. ఆ పత్రంలో ట్రంప్ రష్యన్ ఏజెంట్లతో రాజీకి వచ్చినట్లు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై ట్రంప్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి, క్రిస్టోఫర్ స్టీల్‌పై పరువునష్టం కేసు వేశారు.
ట్రంప్‌కు బ్రిటన్ కోర్టు 7,41,000 డాలర్ల జరిమానా విధింపు !
April 04, 2025
0
Tags