నావికాదళం కోసం ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ మెరైన్ విమానాల కొనుగోలు

Telugu Lo Computer
0


భారత నావికాదళం కోసం ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ మెరైన్ విమానాలను కొనుగోలు చేసేందుకు సోమవారం ఇరు దేశాలు రూ. 63 వేల కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమానికి భారతదేశం తరపున రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, నేవీ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ కె. స్వామినాధన్ హాజరయ్యారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో కొద్దిరోజుల క్రితమే ఈ ఒప్పందాన్ని ప్రధాని మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినేట్ కమిటీ ఆమోదించడం గమనార్హం.ఈ రాఫెల్ మెరైన్ జెట్స్ స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి పని చేయనున్నాయి. 22 సింగిల్-సీట్ రాఫెల్-ఎం జెట్‌లు, నాలుగు ట్విన్-సీట్ ట్రైనర్‌లు, కొన్ని ఆయుధాలు, సిమ్యులేటర్లు, ఐదు సంవత్సరాల పనితీరు-ఆధారిత లాజిస్టిక్స్ సపోర్ట్ లాంటి అంశాలు ఇరు దేశాల కుదుర్చుకున్న ఒప్పందంలో పొందుపరిచి ఉన్నాయి. ఈ 26 రాఫెల్-ఎం యుద్ధ విమానాలు, ఒప్పందం కుదుర్చుకున్న 37 నుంచి 65 నెలల్లో డెలివరీ అవుతాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)