వన్‌ప్లస్ నుంచి 13S పేరిట చేతిలో ఇమిడిపోయే కాంపాక్ట్ ఫోన్ రాబోతోంది. ఈ మేరకు కంపెనీ 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. వెబ్‌సైట్‌లోనూ 'కమింగ్ సూన్' అని పేర్కొంది. కంపెనీ విడుదల చేసిన ఇమేజ్‌ను చూస్తే గత వారం చైనాలో విడుదల చేసిన వన్‌ప్లస్ 13Tనే ఇక్కడ వన్‌ప్లస్ 13Sగా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వనప్లస్ 13Tకి సంబంధించి తొలి చిత్రం బయటకు రాగానే చాలా మంది ఆ లుక్‌ను చూసి ఫిదా అయ్యారు. కాంపాక్ట్ సైజులో, వన్‌ప్లస్ గత మోడళ్లకు భిన్నంగా ఈ ఫోన్ ఉండడంతో చాలా మందిని ఆకట్టుకుంది. అక్కడ బేస్ మోడల్‌ను 12జీబీ+ 256జీబీ వేరియంట్‌లో తీసుకొచ్చారు. ధరను 3,399 యువాన్లుగా నిర్ణయించారు. అంటే మన దేశీయ కరెన్సీ ప్రకారం రూ.39 వేలు అన్నమాట. రెండు కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చారు. క్వాల్‌కామ్ లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను అక్కడ లాంచ్ చేశారు. 13Sను కూడా ఇదే ప్రాసెసర్‌తో తీసుకురానున్నట్లు కంపెనీ తన వెబ్‌సైట్లో ధ్రువీకరించింది. అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. అంతేకాదు అలర్ట్ స్లయిడర్ స్థానంలో కొత్తగా షార్ట్‌కీని ఈ ఫోన్‌లో వన్‌ప్లస్ ప్రవేశపెట్టింది. 50 ఎంపీ+ 50 ఎంపీ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. చూడ్డానికి చిన్నగా ఉన్నా ఈ ఫోన్‌లో 6260 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.
వన్‌ప్లస్ నుంచి 13S పేరిట కాంపాక్ట్ ఫోన్ ?
April 28, 2025
0
Tags