పడిపోయిన ఎంజీ ఆస్టర్ అమ్మకాలు ?

Telugu Lo Computer
0


ఎంజీ మోటార్ అమ్మకాలలో ఆస్టర్‌ ఫెయిల్ మోడల్‌గా నిలుస్తుంది. ఈ మోడల్‌కు  గత కొంత కాలంగా కస్టమర్ల నుంచి దీనికి ఆదరణ తగ్గుతూ వస్తుంది. కంపెనీ నుంచి విడుదలైన నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 2025లో ఎంజీ ఆస్టర్ కేవలం 264 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసింది. అదే గత ఏడాది అనగా 2024 ఇదే ఫిబ్రవరి నెలలో ఇది 1,036 ఆస్టర్ కార్ల విక్రయాలను సాధించింది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే 772 యూనిట్లు తక్కువగా అమ్ముడుపోయాయి. సాధారణంగానే ఆస్టర్ చాలా కాలంగా తక్కువగా సేల్స్‌ను నమోదు చేస్తుండగా, గత నెలలో ఏకంగా భారీగా పడిపోవడంతో ఎంజీ కంపెనీ ఆలోచనలో పడింది. ఈ కారును కంపెనీ 2021లో మార్కెట్లోకి విడుదల చేసింది. కరోనా తరువాత దేశీయ మధ్యతరగతి వినియోగదారులకు ఘనంగా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. దీని ఎక్స్‌టీరియర్ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. కంపెనీ కార్లకు 2019లో బాగా డిమాండ్ ఉంది. ఆ టైంలో కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌ను బట్టి అనేక నాణ్యమైన మోడళ్లను లాంచ్ చేసింది. హెక్టర్, విండ్సర్ కార్లకు ఆదరణ నేపథ్యంలో అదే నమ్మకంతో ఆస్టర్ కారును తీసుకొచ్చింది. కంపెనీ ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ భారతీయ కస్టమర్లు ఈ కారును ఆదరించలేదు. కృత్రిమ మేధస్సుతో ఇండియాలో విడుదలైన మొదటి కారు ఆస్టర్. ఆస్టర్ అనేది ఒక కాంపాక్ట్ SUV. AI ఆధారిత కారుగా విడుదలైన ఈ మోడల్ పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్‌తో వచ్చింది. 4 మీటర్ల కంటే కొంచెం ఎక్కువ పొడవుతో ఉంటుంది. భారతదేశంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్న సమయంలో మధ్యతరగతి భారతీయ వినియోగదారుల కోసం ఆస్టర్‌ను విడుదల చేసిన ఎంజీ దానిలో అద్భుతమైన ఫీచర్స్‌ను అందించింది. ఇంటీరియర్‌లో డజన్ల కొద్ది లేటెస్ట్ ఆప్షన్స్‌ను అందించారు. ఇది పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, లెదర్ ఫినిష్ డ్యాష్‌బోర్డ్, సీట్‌లు, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులను రక్షించడానికి ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా, అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్స్‌తో విడుదల చేసినప్పటి కూడా భారతీయ వినియోగదారులను మాత్రం ఇది ఆకట్టుకోలేకపోయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)