నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అనారోగ్యంతో బాధపడుతూ అసెంబ్లీ సభకు రావడంతో విశ్రాంతి తీసుకుంటారా లేకపోతే సభ నుంచి సస్పెండ్ చేయించమంటారా అంటూ రామానాయుడుతో నారా లోకేష్ అన్నారు. ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి పనిచేస్తానంటే ఇక మిమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేయించాల్సిందే అన్నారు. నిన్నటి వరకూ ఒక చేతికి సిలైన్ ఇంజెక్షన్ పెట్టుకుని శుక్రవారం మరో చేతికి పెట్టుకుని తిరుగుతూంటే ఆరోగ్యం ఏం కావాలన్నారు. లోకేష్ వ్యాఖ్యలకు సమాధానంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ నిన్నటి మీద ఆరోగ్యం కొంచెం బాగానే ఉందని అందుకే వచ్చానని అన్నారు. విశ్రాంతితో కూడిన ప్రశాంత నిద్రతోనే ఆరోగ్యం కుదుటపడుతుందని లోకేష్ అన్నారు. మాట వినకుంటే తన యాపిల్ వాచ్‌ని ఇక మీ చేతికి పెట్టి నిద్రను మానిటర్ చేస్తానని లోకేష్ అన్నారు. తాను పని ఒత్తిడికి గురైనప్పుడు ఓ 15 నిమిషాలు టీవీ చూస్తూ పడుకుంటే తర్వాత ఎంతో రిలాక్స్‌గా ఉంటుందని లోకేష్ అన్నారు. ఈ పద్ధతి ప్రయత్నించి చూడాలని రామానాయుడుకు సూచించారు. అసెంబ్లీలో మంత్రి రామానాయుడు ఆరోగ్యంపై నారా లోకేష్ ప్రస్తావించారు. కీలక శాఖలో ఉన్న మంత్రి నిమ్మల ప్రస్తుతం స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారని మంత్రి లోకేష్ అన్నారు. రామానాయుడు విశ్రాంతి తీసుకోవడానికి రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును లోకేష్ కోరారు. ఆయన ప్రకటనకు మరో సభ్యుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మద్దతు తెలిపారు.
రామానాయుడు గారూ విశ్రాంతి తీసుకుంటారా లేకపోతే సస్పెండ్ చేయించమంటారా !
March 07, 2025
0
Tags