కష్టించి పని చేయడాన్ని నేను బలంగా నమ్ముతా : అమితాబ్ కాంత్

Telugu Lo Computer
0


70 గంటల పని విధానంపై నీతిఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ స్పందించారు. కష్టించి పని చేయడాన్ని నేను బలంగా నమ్ముతా. వారానికి 80 లేక 90 గంటలైనా సరే భారతీయులు కష్టపడి పనిచేయాలి. భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు ట్రిలియన్ల నుంచి 30 ట్రిలియన్లకు మారాలంటే  వినోదమో, సినీ తారల అభిప్రాయాలను అనుసరించడం వలనో సాధ్యంకాదు అని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా, ఖర్చులు మించకుండా గడువులోగా ప్రాజెక్టులు పూర్తిచేయాలంటే హార్డ్‌వర్క్ తప్పనిసరన్నారు. కష్టపడి పనిచేయకపోవడం గురించి మాట్లాడటం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిందన్నారు. వర్క్‌-లైఫ్ బ్యాలెన్స్ సంబంధిత చర్చ యువతకు తప్పు అర్థాలను అందిస్తోందని అభిప్రాయడ్డారు. నేను ప్రతిరోజు వ్యాయామం చేస్తాను. నాకిష్టమైన గోల్ఫ్‌ ఆడతాను. అలాగే కష్టపడి పనిచేస్తాను. మీకో ఒక గంటన్నర పక్కన పెట్టుకోండి. అయినా సరే 22.5 గంటల సమయం ఉంటుంది. అలా వర్క్‌- లైఫ్‌ బ్యాలెన్స్‌కు చాలా సమయం ఉంటుంది. కానీ కష్టపడి పనిచేయకూడదని చెప్పడాన్ని ఒక ఫ్యాషన్‌గా మాత్రం మార్చవద్దు అని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అమితాబ్ కాంత్ వెల్లడించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)