బుల్లెట్ రైలు సహా, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు త్వరితగతిన జరుగుతున్నాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. శనివారం గుజరాత్‌లోని ఆనంద్‌లో బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి సమీక్షించిన ఆయన నిర్మాణ పనులు వేగంగా చేపడుతున్న కార్మికులను ప్రశంసించారు. 360 కిలోమీటర్ల మేర బుల్లెట్ ప్రాజెక్ట్ పూర్తయ్యిందన్న ఆయన బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు పట్టాలెక్కనుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం నిర్మిస్తున్న 200 మీటర్ల పొడవైన స్టీల్ వంతెనను కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ బ్రిడ్జ్ బరువు 1100 టన్నులకు పైగా బరువు ఉంటుందని తెలిపారు. టాటా, జేఎస్‌డబ్ల్యూ, సెయిల్ వంటి ప్రముఖ తయారీదారుల నుంచి ఉక్కును సేకరించి ఈ అధిక నాణ్యత గత సామగ్రిని ప్రాజెక్ట్ కోసం వినియోగించినట్లు ఆయన తెలిపారు. ఈ వంతెన కోసం పని చేస్తున్న శ్రామికులు, ఇంజనీర్లు గతంలో చీనాబ్, అజీ బ్రిడ్జ్ నిర్మాణంలో పనిచేశారని తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే హయాంలో ఈ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఎటువంటి సహకారం అందలేదన్న ఆయన.. ప్రస్తుతం ఉన్న దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. ఉద్ధవ్ ప్రభుత్వం వల్ల ఈ ప్రాజెక్ట్ రెండున్నరేళ్లు ఆలస్యం అయ్యిందన్నారు.
360 కిలోమీటర్ల బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పూర్తి : అశ్వినీ వైష్ణవ్
March 01, 2025
0
Tags