అమెరికా పౌరులు ఎవరూ పాకిస్థాన్‌కు వెళ్లొద్దు అంటూ తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో టెర్రరిస్టులు దాడులు జరిపే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పాకిస్థాన్‌లో దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకూ ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదంటూ పౌరులకు తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇదే సమయంలో.. పాకిస్థాన్ వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటే భారత సరిహద్దు ప్రాంతాలకు, బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లకు మాత్రం అస్సలు వెళ్లొద్దని హెచ్చరించింది. ఆయా ప్రావిన్స్‌లలో టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగవచ్చని పేర్కొంది. ఇదే సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లేవారూ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. మార్కెట్లు, రవాణా కేంద్రాలు తదితర ఏరియాలలో పౌరులను, పోలీసులను, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు.. పాక్ నుంచి భారత్‌లో అడుగుపెట్టేందుకు ఉన్న ఏకైక అధికారిక మార్గం వాఘా బార్డర్ మాత్రమేనని, సరిహద్దులు దాటి భారత్ లో అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి అని పేర్కొంది. ముందు వీసా తీసుకున్నాకే బార్డర్ వద్దకు వెళ్లాలని, వాఘా బార్డర్ వద్ద వీసా పొందే అవకాశం లేదని వివరించింది.
పాకిస్థాన్‌కు వెళ్లొద్దంటూ అమెరికా పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ !
March 09, 2025
0
Tags