2018లో సంచలనం సృష్టించిన పరువు హత్యకేసులో నల్గొండ ఎస్టీ, ఎస్సీ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. అమృత ప్రణయ్ మర్డర్ కేసులో మొత్తం 8 మంది నిందితులకు గానూ ఏ1 ఉన్న మారుతిరావు చనిపోయాడు. ఏ2 సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో అమృత బాబాయ్ శ్రవణ్ కూడా ఏ6గా ఉన్నాడు. ఆయనకు కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో శవణ్ కుటుంబం కోర్టు ముందే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ రావు, అమృత తండ్రైన ఏ1 మారుతీ రావులు అన్నదమ్ములు.
ప్రణయ్ హత్య కేసులో సుభాష్ శర్మ కు ఉరిశిక్ష విధించిన కోర్టు !
March 10, 2025
0
Tags