ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే ఘటనా స్థలం చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏలూరులో ప్రైవేట్ బస్సు బోల్తా పడి 30 మందికి తీవ్ర గాయాలు !
March 10, 2025
0
Tags