మార్కెట్ లో పడిపోయిన వన్‌ప్లస్ షేర్ ?

Telugu Lo Computer
0


న్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లతో మొదలుపెట్టి స్మార్ట్ టీవీలు, వేరబుల్స్, యాక్సెసరీస్ అంటూ దూసుకెళ్లింది. కానీ ఇప్పుడు వన్‌ప్లస్ మార్కెట్ షేర్ ఒక్కసారిగా పడిపోయింది. IDC ఇండియా రిపోర్ట్ ప్రకారం 2023లో 6.1% ఉన్న మార్కెట్ షేర్, 2024లో 3.9%కి పడిపోయింది. కెనాలిస్ అనే మరో సంస్థ మరో షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది. 2023 మొదట్లో 21% ఉన్న మార్కెట్ షేర్, 2024కి వచ్చేసరికి 6 శాతానికి పడిపోయిందని తేల్చేసింది. ఇదిలా ఉంటే, ఐక్యూ, మోటరోలా లాంటి బ్రాండ్లు మాత్రం దూసుకుపోతున్నాయి. తక్కువ ధరకే పవర్ఫుల్ ఫోన్లు, స్మూత్ ఆపరేటింగ్ సిస్టమ్ తో వన్‌ప్లస్ యూజర్ల మనసు దోచుకుంది. కానీ సమయం మారుతున్న కొద్దీ వన్‌ప్లస్ స్ట్రాటజీ కూడా మారింది. మొదట్లో శామ్‌సంగ్‌కు పోటీగా ప్రీమియమ్ ఫోన్లతో దుమ్మురేపింది. ఆ తర్వాత అమ్మకాలు పెంచుకోవడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను కూడా మార్కెట్లోకి వదిలింది. షియోమీ, రియల్‌మీ, వివో, ఒప్పో లాంటి బ్రాండ్లతో వన్‌ప్లస్ పోటీ పడాల్సి వచ్చింది. ఆయా కంపెనీల ఫోన్లకు పోటీ ఇచ్చే ఫోన్లను ఇది రిలీజ్ చేసింది. ఈ స్ట్రాటజీతో వన్‌ప్లస్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని అయిందని టెక్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఒకప్పుడు యంగ్ టెక్ లవర్స్‌కి డ్రీమ్ బ్రాండ్‌గా ఉన్న వన్‌ప్లస్ క్రేజ్ తగ్గిపోయిందని టెక్ అనలిస్ట్ ఫైజల్ కావూసా అభిప్రాయపడ్డారు. వన్‌ప్లస్ పడిపోవడానికి క్వాలిటీ కూడా ఒక కారణం. వన్‌ప్లస్ 7 సిరీస్ తర్వాత ఫోన్ల పర్ఫార్మెన్స్ తగ్గిపోయిందని ఫైజల్ కావూసా అంటున్నారు. వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 13 మోడల్స్ కాస్త బెటర్ అనిపించినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఆయన చెబుతున్నారు. వన్‌ప్లస్‌కి పెద్ద దెబ్బ తగిలేలా చేసింది డిస్‌ప్లే సమస్య. చాలా ఫోన్లలో గ్రీన్ లైన్ వచ్చేసింది. సోషల్ మీడియాలో కంప్లైంట్స్ వెల్లువెత్తాయి. కస్టమర్లు విసిగిపోయారు. రిటైలర్లు రిటర్న్స్, వారంటీ క్లెయిమ్స్‌తో తలలు పట్టుకున్నారు. ప్రాఫిట్ మార్జిన్స్ లేకపోవడం, కంపెనీ సపోర్ట్ సరిగా లేకపోవడం, వారంటీ ప్రాసెసింగ్ లేట్ అవ్వడంతో షాపుల వాళ్లు వన్‌ప్లస్‌పై తిరగబడ్డారు. 2024, మేలో ఏకంగా 4,500 రిటైలర్లు వన్‌ప్లస్ ఫోన్లను అమ్మడం బంద్ చేశారు. రిటైల్ షాపుల్లో ఇష్యూస్ రావడంతో వన్‌ప్లస్‌కి భారీ నష్టం జరిగింది. ఆన్‌లైన్‌లో, ముఖ్యంగా అమెజాన్‌లో వన్‌ప్లస్ బాగా పాపులర్ అయింది. కానీ ఆఫ్‌లైన్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనే ప్లాన్ బెడిసి కొట్టింది. ఇది వన్‌ప్లస్ బ్రాండ్ ఇమేజ్‌ని మరింత దెబ్బతీసింది. తక్కువ ధరలో ఫోన్లు అమ్మడం కోసం వన్‌ప్లస్ తీసుకొచ్చిన నార్డ్ సిరీస్ సేల్స్ పెంచడానికి హెల్ప్ చేసింది. కానీ ఇది బ్రాండ్ వాల్యూని తగ్గించేసింది. పైగా 20 వేల నుంచి 30 వేల రూపాయల సెగ్మెంట్‌లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. యాపిల్ కూడా ఐఫోన్ల ధరలు తగ్గించి, ఈజీ EMI ఆప్షన్లు, ఫెస్టివల్ ఆఫర్లతో రెచ్చిపోయింది. ఒకప్పుడు వన్‌ప్లస్ కొనేవాళ్లు కూడా ఇప్పుడు ఐఫోన్ల వైపు చూస్తున్నారు. నార్డ్ సిరీస్‌కి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా, ఫ్లాగ్‌షిప్ మోడల్స్ మాత్రం వెనకబడిపోయాయి. 2024లో శామ్‌సంగ్, వివో, ఐకూ, ఒప్పో కూడా వన్‌ప్లస్ మార్కెట్ షేర్‌ను లాగేసుకున్నాయి. ఒకప్పుడు వన్‌ప్లస్ మొబైల్స్ వస్తున్నాయంటే ప్రజలు విపరీతంగా బుక్ చేసుకునేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)