అరటి పండు నల్ల మచ్చలు - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0

రటి పండు తొక్కపై నల్లటి మచ్చలు కుళ్లిపోవడానికి సంకేతం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇవి పాడైపోయినవని కాదట. అలాంటి అరటి పండు బాగా పండిందని అర్థం అంటున్నారు. అరటి పండు తొక్కపై ఉండే నల్లమచ్చల్లోని టీఎన్ఎఫ్ క్యాన్సర్ తో పోరాడుతుందట. అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా అడ్డుకుంటుందని చెబుతున్నారు. బాగా పండిన అరటి పండ్లు తీయగా, కమ్మగా ఉంటాయి.  అరటిపండ్లు బాగా పండినప్పుడు వాటిలోని పిండి పదార్థాలు చక్కెరలుగా మార్చబడతాయి. ఈ పండ్లు చాలా త్వరగా జీర్ణమవుతాయని, జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఈ పండ్లు మంచి ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా అరటి పండు తొక్కపై ఉండే నల్ల మచ్చల్లో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో అనవసరపు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉండదు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బాగా పండిన అరటిపండు యాంటాసిడ్ గా పనిచేస్తుంది. అలాగే కడుపు ఆమ్లాలు, చికాకు నుంచి కూడా ఇలాంటి పండ్లు రక్షిస్తాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల గుండెల్లో మంట త్వరగా తగ్గిపోతుంది.రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)