యువతలో ఏఐ నైపుణ్యాలు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం !

Telugu Lo Computer
0


మైక్రోసాఫ్ట్‌తో యువతలో ఏఐ నైపుణ్యాలు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏఐ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏడాది వ్యవధిలో రెండు లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో మైక్రోసాఫ్ట్‌, ఏపీఎస్‌ఎస్‌డీ ఎంవోయూ చేసుకున్నాయి. ఐటీ, ఇతర పరిశ్రమలకు అవసరమైన సిబ్బందిని తయారు చేయడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. దాదాపు 2 లక్షల మంది రాష్ట్ర యువతకు అంతర్జాతీయంగా ఉద్యోగాలు వచ్చే విధంగా మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇవ్వనుంది. 50 గ్రామీణ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 500 మంది అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనుంది. 10వేల మంది విద్యార్థులకు ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో, 30 ఐటీఐల్లోని 30 వేల మంది విద్యార్థులకు డిజిటల్‌ ప్రొడక్టివిటీలో ఏఐ శిక్షణ ఇవ్వనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)