భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ !

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. వరుసగా ఆరో రోజు దుమ్మురేపింది. బ్యాంకింగ్ స్టాక్స్ రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. దీంతో ఇంట్రాడేలో సెక్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లకు ఎగిసింది. చాలా రోజుల తర్వాత మళ్లీ 78 వేల పాయింట్ల మైలురాయి తాకింది. ఇక నిప్టి కూడా సత్తా చాటింది. 23,700 స్థాయిని దాటింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ. 5 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో మొత్తం మార్కెట్ విలువ ఇప్పుడు రూ.418 లక్షల కోట్లకు చేరింది. నిప్టీ మిడ్ క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సైతం ఒక శాతం మేర లాభపడ్డాయి. ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభం నుంచే జోరు కనిపించింది. సెన్సెక్స్ లాభాలతో 77,456.27 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ తో ప్రారంభమైంది. రోజంతా అదేస్థాయిలో కొనసాగింది. మధ్యలో కాస్త జోష్ తగ్గి నెమ్మదించినా.. మళ్లీ పుంజుకుంది. ఇంట్రాడేలో 78,107.23 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 1078.87 పాయింట్ల లాభంతో 77,984.38 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తూ ఇంట్రాడేలో 23,700 పాయింట్ల మార్కును దాటి, చివరకు 307.95 పాయింట్లు లాభపడి 23,658.35 వద్ద స్థిరపడింది. రూపాయి కూడా డాలర్‌తో డాలర్‌తో పోలిస్తే 35 పైసలు బలపడి 85.64 వద్ద నిలిచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)