కొత్త రెనాల్ట్ కైగర్‌లో పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి. ఎక్స్‌టీరియర్ డిజైన్ నుండి ఇంటీరియర్ వరకు కొత్తదనం కనిపిస్తుంది. ఇందులో 1.0L న్యాచురల్ పెట్రోల్ ఇంజన్, 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్‌తో కూడిన రెండు ఇంజన్లు ఉన్నాయి. ఇది కాకుండా మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో తీసుకొచ్చారు. కొత్త కైగర్‌లో భద్రత కోసం అనేక మంచి ఫీచర్‌లను తీసుకొచ్చింది. EBD, 6 ఎయిర్ బ్యాగ్స్, 3 పాయింట్ సీట్ బెల్ట్, EPS, స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ హిల్ హోల్డ్, డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లను ఈ కారులో చూడచ్చు. కొత్త కిగర్ అంచనా ధర రూ.6 లక్షల నుండి మొదలవుతుంది. రెనాల్ట్ కొత్త కైగర్ నేరుగా టాటా పంచ్‌తో పోటీపడుతుంది. పంచ్ ధర రూ.6.13 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. క్రాష్ టెస్ట్‌లలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించిన మొదటి ఎస్‌యూవీ. ఈ కారులో 5 మంది కూర్చునే అవకాశం ఉంది. చిన్న కుటుంబాలకు ఇది మంచి ఎంపిక. ఈ కారులో ముందు 2 ఎయిర్‌బ్యాగ్స్, 15 అంగుళాల టైర్లు, ఇంజిన్ స్టార్ట్ స్టాప్, 90 డిగ్రీల ఓపెనింగ్ డోర్లు, సెంట్రల్ లాకింగ్ కీ, వెనుక పార్కింగ్ సెన్సార్, ABS+EBD, ఫ్రంట్ పవర్ విండో, టిల్ట్ స్టీరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కొత్త లుక్‌లో రెనాల్ట్ కైగర్ !
March 24, 2025
0
Tags