విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆశా వర్కర్ల ధర్నా !

Telugu Lo Computer
0


ఆంధ్ర ప్రదేశ్‌ లో కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్ల విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచీ ధర్నా చౌక్ కు చేరుకుంటున్నారు.  ఆశావర్కర్ల కదలికలను డ్రోన్లు, ఇంటిలిజెన్స్ టీం ల ద్వారా కనుగొంటున్నారు పోలీసులు. ధర్నాచౌక్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు కూడా ఉంది. ఆర్ముడ్ రిజర్వ్, సివిల్, ర్యాపిడ్ యాక్షన్ టీం లను సిద్ధం చేశారు పోలీసులు. ఏడీసీపీ, ఏఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, నలుగురు సీఐలు, ఇతర సిబ్బంది మొత్తం 100 మందితో భద్రత ఏర్పాటు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)