ఆంధ్రప్రదేశ్ లోని దాచేపల్లి సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న లక్ష్మీప్రసాద్ అనే ఉద్యోగి పింఛన్ డబ్బులను తీసుకుని భార్యాపిలల్లతో సహా కనిపించకుండా పోయాడు. అతడు ఏమయ్యాడోనని వెతికేలోపుగా అతడే ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసాడు. అందులో అతడు దీనంగా మాట్లాడుతూ ''సార్ కమిషనర్ గారూ, నేను ఆన్ లైన్ బెట్టింగులో డబ్బులు పోగొట్టుకున్నా. ఈ బెట్టింగులో ప్రభుత్వ సొమ్మును కూడా ఖర్చు చేసేశా. తప్పు తెలుసుకున్నా. నేను చేసిన తప్పు వల్ల నా భార్యాబిడ్డలను రోడ్డుపైన పడేసా. ఈ ఒక్కసారికి క్షమించండి. ఒక్క నెలరోజుల్లో ప్రభుత్వ సొమ్మును ఎలాగైనా తిరిగి అప్పగించేస్తాను. సార్ కలెక్టర్ గారూ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నా పిల్లలు రెండు రోజులుగా అన్నం కూడా తినలేదు'' అంటూ గద్గద స్వరంతో దీనాతిధీనంగా వేడుకుంటున్నాడు. తమ పిల్లల్ని ఎత్తుకుని వెనుకవైపు నిల్చున అతడి భార్య ఎంతో బాధతో కన్నీళ్లు తుడుచుకుంటోంది. ఇటువంటి కష్టం ఎవ్వరికీ రాకూడద పాపం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆన్ లైన్ బెట్టింగులో మోసపోయా, ప్రభుత్వ సొమ్మును కూడా ఖర్చు చేసేశా ఈ ఒక్కసారికి క్షమించండి !
March 05, 2025
0
Tags