ఆంధ్రప్రదేశ్ లో పోసాని కృష్ణమురళి తర్వాత అరెస్టు అయ్యేది మాజీ మంత్రులు కొడాలి నాని, ఆర్కే రోజాయేనని కేఏ పాల్ జోస్యం చెప్పారు. వీరిద్దరి తర్వాత జగన్ ను కూడా అరెస్టు చేస్తారని పాల్ చెప్పుకొచ్చారు. ప్రశ్నించినందుకు నటుడు పోసాని కృష్ణమురళిపై 14 కేసులు వేసారని, మరి పవన్ కళ్యాణ్ ని తిట్టి రోడ్డుపై నడిపిస్తానని అన్న వారి మీద కేసులు పెట్టరా అని అడిగారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పోరాటం చేస్తూ అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నించాలని పాల్ విజ్ఞప్తి చేశారు. 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని, నిరుద్యోగులకు ఉద్యోగాలని చెప్పి పవన్ ప్రజలను మోసం చేశారన్నారు. విదేశాల్లో లక్షల కంపెనీలు ఉన్నాయని, వాటిని తీసుకువస్తానని చెప్పిన చంద్రబాబు ఒప్పుకోవడం లేదన్నారు. ఆదాని, అంబానీల కంపెనీలు మాత్రమే అని మోడీ అంటున్నారని, ఇతర కంపెనీలు రాకపోతే నిరుద్యోగ సమస్య ఎలా పరిష్కారం అవుతుందన్నారు. కూటమి, వైసీపీ తెలుగు ప్రజలను మోసం చేశాయని, రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రజాశాంతి పార్టీయే దిక్కని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, కోర్టుల తీర్పుల విషయంలో సత్వర న్యాయం జరగడం లేదన్నారు. త్వరలో హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, ఇండివిడ్యువల్ రైట్స్ తో భారత న్యాయవ్యవస్థపై పోరాటం చేస్తానని పాల్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీలో కూటమి ఓడిపోయిందని, డబ్బులు ఖర్చు పెట్టి కృష్ణ గోదావరి జిల్లాలో కూటమి ఎమ్మెల్సీ సీట్లు గెలిచిందని ఆరోపించారు.
పోసాని తర్వాత అరెస్టయ్యేది కొడాలి నాని, ఆర్కే రోజా : కేఏ పాల్ జోస్యం !
March 04, 2025
0
Tags