అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం !

Telugu Lo Computer
0


తిరుపతి లోని అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం రేగింది. అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో గాలి గోపురం వద్ద చిరుతపులి కనిపించింది. అది ఓ పిల్లిని వేటాడి అడవిలోకి తీసుకెళ్లింది. ఈ మేరకు సీసీ కెమెరాల్లో రికార్డయింది. గత రాత్రి తిరుపతిలోని జూ పార్క్ రోడ్డులోనూ చిరుతపులి కనిపించినట్టు తెలిసింది. కాగా, టీటీడీ రాత్రి 10 గంటల తర్వాత నడక మార్గాల్లో భక్తులను అనుమతించడంలేదు. 12 ఏళ్ల లోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల లోపే నడక మార్గంలో తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)