ఆంధ్రప్రదేశ్ లో భాజపాకు ఒకటి, జనసేనకు ఒకటి, తెదేపాకు మూడు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో  భాజపాకు ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తూ తెదేపా నిర్ణయం తీసుకుంది. మొత్తం ఐదు స్థానాలకుగానూ ఇప్పటికే జనసేనకు ఒక సీటు కేటాయించగా, చివరి నిమిషంలో భాజపా పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో ఆ పార్టీకి ఒక సీటు కేటాయించినట్టు తెలుస్తోంది. ఈసారి భాజపాకు ఒక సీటు ఇచ్చినందున సర్దుబాటు చేయలేకపోతున్నామని, 2027లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడుతున్నందున అప్పుడు అవకాశం కల్పిస్తామని ఆశావహులకు పార్టీ పెద్దలు సర్ది చెబుతున్నారు. ఈ మేరకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి జవహర్‌, దువ్వారపు రామారావు, టీడీ జనార్ధన్‌కు అధిష్ఠానం నుంచి ఫోన్లు వెళ్లినట్టు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)