తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవుల కోసం నామినేషన్ దాఖలు చేసిన ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్ నుండి ముగ్గురు, సీపీఐ నుండి ఒకరు, బీఆర్ఎస్ నుండి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. వారికి పోటీగా మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేసినప్పటికీ వారి పత్రాలు నిబంధనలకు అనుకూలంగా లేకపోవడంతో ఎన్నికల అధికారి వాటిని తిరస్కరించారు. గురువారం సాయంత్రం5 గంటలతో ఆ గడువు ముగిసింది. దీంతో నామినేషన్స్ దాఖలు చేసిన వారి ఎన్నిక ఏకగ్రీవమైనట్లుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి విజయ శాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఎమ్మెల్సీలుగా శాసన మండలిలో అడుగుపెట్టనున్నారు. అలాగే సీపీఐ నుండి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ పార్టీ నుండి దాసోజు శ్రవణ్ కుమార్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
తెలంగాణ శాసన మండలికి ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం !
March 13, 2025
0
Tags