ఎగురుతున్న విమానంలో నగ్నంగా తిరిగిన యువతి : సోషల్ మీడియాలో వీడియో వైరల్

Telugu Lo Computer
0


మెరికాలోని హూస్టన్ నుండి ఫీనిక్స్ వెళ్తున్న  సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం 733లో  ఓ యువతి ఒక్కసారిగా బట్టలు లేకుండా అటు ఇటు నడవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో పెద్ద సంచలనంగా మారింది. వీడియోలో ఉన్నట్టుండి ఓ యువతికి సంబంధించిన కేకలు వినిపిస్తూ ఉంటాయి. ఇంతలోనే ముందుకు తిరిగి చూస్తే ఆ యువతి బట్టలేకుండా కేకలు వేస్తూ అరుస్తూ అటు ఇటు తిరగడం గమనించవచ్చు. వీడియోలో ఆ యువతి ఎలాంటి బట్టలు లేకుండా ఉండడం చూసి ప్రయాణికులు కూడా ఒక్కసారిగా కేకలు వేశారు. ఈ సన్నివేశాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ విమానం విలియం పి. హాబీ విమానాశ్రయం నుంచి రన్ వేపై పైకి ఎగురుతుండగానే ఆ మహిళ ఒక్కసారిగా తనకున్న దుస్తులను పూర్తిగా వంటి పైనుంచి తొలగించి  నగ్నంగా విమానం క్యాబిన్ లో అటు ఇటు తిరగడం ప్రారంభించింది. అక్కడున్న ప్రయాణికులు కూడా ఆమెను ఏమాత్రం ఆపకుండా అలాగే చూస్తుండి పోయారు. ఇలా ఆ మహిళ 25 నిమిషాల పాటు అలాగే దుస్తులు లేకుండా అటు ఇటు తిరిగిందని కొంతమంది ప్రయాణికులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆమె వెంటనే విమానం తలుపులు తెరిచి బయటికి పంపాలని కూడా డిమాండ్ చేసిందట. దీంతో ఆ విమాన సిబ్బంది ఆమె చేస్తున్న డిమాండ్ పై స్పందించి విమానాన్ని టేక్ ఆఫ్ చేసి ఆమెను అక్కడి నుంచి బయటికి పంపించారు. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఆమె పోలీసుల నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో కొంతమంది ప్రయాణికులు ఆమెను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)