టీమ్ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనత సాధించాడు. వన్డే కెరీర్‌లో అత్యంత వేగంగా ఐదు వికెట్ల తీసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వరుణ్ 5 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు. కాగా.. వరుణ్ చక్రవర్తికి ఇది రెండో వన్డే మ్యాచ్ మాత్రమే. ఇంతకు ముందు ఈ ఘనత టీమ్ఇండియా మాజీ ఆటగాడు స్టువర్ట్ బిన్నీ పేరిట ఉండేది. బిన్నీ తన మూడో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో బిన్నీ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. కివీస్ తో మ్యాచ్ ప్రదర్శనతో వరుణ్ మరో ఘనతను సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రవీంద్ర జడేజా తొలి స్థానంలో ఉన్నాడు. 2013లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయగా కివీస్‌తో మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి 42 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
వన్డేలో అత్యంత వేగంగా ఐదు వికెట్ల తీసిన భారత ఆటగాడిగా వరుణ్ చక్రవర్తి
March 03, 2025
0