వివాహేతర బంధం ప్రాణం తీసింది !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  కృష్ణా జిల్లా, నిడమానూరులో  ప్రకాశ్, కావ్య దంపతులు నివాసం ఉంటున్నారు. కావ్య  రెయిన్ బో   ఆస్పత్రిలో ఆయాగా విధుల్లో చేరింది. ఈ క్రమంలోనే ఆమెకు అక్కడ పని చేస్తున్న వాసు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. గత కొంతకాలంగా ఇద్దరూ నిత్యం ఫోన్ లో  గంటలు గంటలు మాట్లాడుకునే వారు. అప్పడప్పుడు బయట కూడా కలుస్తుండే వారు. అయితే, విషయం తెలుసుకున్న కావ్య భర్త ప్రకాశ్ ఆమెను ఉద్యోగం మాన్పించాడు. ఆమెను నుంచి సెల్ ఫోన్ తీసుకుని ఇంట్లో పనులు చూసుకోవాలని మందలించాడు. దీంతో కొన్నాళ్లుగా కావ్య ఇంట్లోనే ఉంటుంది. అయితే, ఫోన్ చేసినా కావ్య తనతో మాట్లాడటం లేదంటూ ప్రియుడు వాసు ఆమెపై విపరీతంగా కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కావ్య ఇంటికి వెళ్లి ఆమె మెడకు చున్నీ బిగించి హతమార్చాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)