తమిళంతోపాటు తెలుగులో మాట్లాడినా మాజీ స్పీకర్ పొల్లాచ్చి జయరామన్ తనవైపు కన్నెత్తి చూడలేదని నగర పాలక శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ ఎద్దేవా చేశారు. శాసనసభలో గురువారం ఉదయం పొల్లాచ్చి జయరామన్ మాట్లాడుతూ పొల్లాచ్చి నగరంలో భూగర్భ డ్రైనేజీ పథకంలో 22వేల ఇళ్ళకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా ఏడువేల ఇళ్ళకు మాత్రమే ఇచ్చారని, తక్కిన ఇళ్ళకు కూడా కనెక్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి కేఎన్ నెహ్రూ సమాధానమిస్తూ తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొల్లాచ్చి జయరామన్ డిప్యూటీ స్పీకర్‌గా తమ వైపు కన్నెత్తి కూడా చూడలేదని, చివరకు ఆయనకు బాగా తెలిసిన తెలుగులో మాట్లాడినా ప్రయోజనం లేదని ఎద్దేవా చేయడంతో సభలో అటు పాలకపక్షం, ఇటు ప్రతిపక్ష సభ్యులు గొల్లుమన్నారు. ఆ తర్వాత మంత్రి నెహ్రూ మాట్లాడుతూ పొల్లాచ్చిలో పెండింగ్‌లో ఉన్న 15 వేల మందికి త్వరలోనే భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
తెలుగులో మాట్లాడినా మావైపు కన్నెత్తి చూడలేదు : పొల్లాచ్చి జయరామన్‌పై మంత్రి నెహ్రూ వ్యాఖ్య !
March 21, 2025
0
Tags