ఇళయరాజా ఇంటికి వెళ్లిన తమిళనాడు సీఎం స్టాలిన్ !

Telugu Lo Computer
0


ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంటికి తమిళనాడు సీఎం స్టాలిన్ వెళ్లారు. మార్చి 8న లండన్ లో భారీస్థాయిలో ఆర్కెస్ట్రా ప్రదర్శన నిర్వహించనున్నందున ఆయన్ను స్వయంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఇళయరాజాను శాలువతో సన్మానించి కాసేపు మాట్లాడారు. సంబంధిత వీడియోను స్టాలిన్ తన 'ఎక్స్' ఖాతాలో పోస్టు చేశారు. ఇళయ రాజాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజల సంగీత శ్వాసగా కొనియాడిన స్టాలిన్.. నిర్వహించనున్న సింఫనీ కార్యక్రమం ఆసియాలోనే ఇంతకుముందు ఎవరూ సాధించని విజయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టేందుకు ధైర్యంగా ముందుకు వచ్చిన ఆయనను స్టాలిన్ అభినందించారు. ఈసందర్భంగా ఇళయరాజా తన చేతితో రాసిన మ్యూజిక్ నోట్స్ ని తనకు చూపించారని సీఎం స్టాలిన్ వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)