పోసాని కృష్ణమురళి ఆదోని తరలింపు !

Telugu Lo Computer
0

                                                  

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని గుంటూరు జిల్లా జైలు నుంచి ఆదోని తరలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను దూషించిన ఘటనలో కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోమంగళవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా జైలుకు చేరుకొని పోసానిని అప్పగించాలని జైలు అధికారులను కోరారు. వైద్య పరీక్షల అనంతరం అతన్ని కర్నూలు జిల్లా పోలీసులు ఆదోని తీసుకెళ్లారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)