పార్లమెంట్ ఉభయ సభల్లో డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ డీఎంకే ఎంపీలు ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా ఎంత వారించినా ఎంపీలు వినకపోవడంతో లోక్ సభను పలుమార్లు వాయిదా వేశారు. సభ్యులు సభ సంప్రదాయని పాటించాలని, టీ షర్టులు ధరించి సభలోకి రావడం సరైన పద్ధతి కాదని స్పీకర్ కోరారు. అదే విధంగా రాజ్యసభలోనూ డీఎంకే ఎంపీలతో పాటు పలు పార్టీల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనాభా పరంగా పార్లమెంట్ పునర్విభజన చేపట్టడంతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుందని డీఎంకే ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. డిలిమిటేషన్కు ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాలని ఎంపీలు డిమాండ్ చేశారు.
పార్లమెంట్ లో డీఎంకే ఎంపీల ఆందోళన
March 20, 2025
0
Tags