కొడాలి నాని అనుచరులకు నోటీసులు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులపై గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇందులో వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించడం, లిక్కర్ గౌడౌన్ వ్యవహారంలో బెదిరించిన కేసులు ఉన్నాయి. వీటిలో కొడాలి నాని ప్రధాన అనుచరులుగా పేరున్న దుక్కిపాటి శశిభూషణ్ తో పాటు పాలడుగు రాంప్రసాద్, గుడివాడ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీనులకు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ రెండు కేసుల్లో మాజీ మంత్రి కొడాలి నానితో పాటు అప్పటి ఏపీ బెవరేజేస్ కార్పోరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి , జేసీ మాధవీలత పై గతంలో వివిధ సెక్షన్ల కింద గుడివాడ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో వారు హైకోర్టును ఆశ్రయించడంతో 41ఏ నోటీసులిచ్చి విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కొడాలి నాని అనుచరులకు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ కేసుల్లో అనుచరుల విచారణ తర్వాత కొడాలి నానికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలైన చంద్రబాబు, లోకేష్ పై కొడాలి నాని తీవ్ర విమర్శలు చేసే వారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా ఈ దాడి కొనసాగింది. దీనిపై అప్పట్లో టీడీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం రావడంతో ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో కొడాలిని అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)