తెలంగాణలో గ్రూప్-3 ఫలితాలు విడుదల !

Telugu Lo Computer
0


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జాబితాతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్స్, ఫైనల్ కీని కూడా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1365 గ్రూప్-3 పోస్టులకు గతేడాది నవంబర్ 17, 18 తేదీలలో రాత పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ కేవలం 2.69 లక్షల మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. అంటే రాత పరీక్షలకు 50.24 శాతం హాజరైనట్లు తెలుస్తోంది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ అధికారులు పేర్కొన్నారు. టీజీపీఎస్సీ ఇటీవల కాంపిటీటివ్ పరీక్షల ఫలితాలను వరుసగా విడుదల చేస్తోంది. చెప్పినట్లుగానే షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 10, 11 తేదీల్లో గ్రూప్-1 ఫలితాలు, గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)