యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్‌వేస్ భారతీయ ప్రయాణికులకు 30 శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సీజన్ లో భారతీయ ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆఫర్ తీసుకువస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు టర్కీ, గ్రీస్, స్పెయిన్, ఫ్రాన్స్, వార్సా, ప్రాగ్ రూట్లలో ప్రయాణించే వారికి ఈ ప్రత్యేక డిస్కౌంట్ వర్తిస్తుందని ఎతిహాద్ యాజమాన్యం ప్రకటించింది. మార్చి 28వ తేదీ వరకు ఈ స్పెషల్ ఆఫర్ తో టికెట్లు బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించేందుకు టికెట్ లను బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. సమ్మర్ వెకేషన్‌ను తక్కువ బడ్జెట్‌తో ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తున్న వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎతిహాద్ ఎయిర్‌వేస్ కోరుతుంది. ప్రయాణికులు వీలైనంత త్వరగా తమడెస్టినేషన్ ఫిక్స్ చేసుకొని టికెట్లు బుక్ చేసుకోవాలని పిలుపునిస్తుంది.
ఎతిహాద్ ఎయిర్‌వేస్ లో భారతీయ ప్రయాణికులకు 30% ప్రత్యేక డిస్కౌంట్ !
March 26, 2025
0
Tags