ఆంధ్రప్రదేశ్ లో పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీకి అదనంగా రూ.20 వేలు సబ్సిడీ రూపంలో బీసీలకు అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2 కిలో వాట్ల సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుకు రూ.1.20 లక్షలు వరకు ఖర్చవుతుండగా, కేంద్ర ప్రభుత్వం రూ.60 వేలు రాయితీగా అందిస్తుంది. అయితే బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో రూ.20 వేలు అదనంగా రాయితీ అందించనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీని ప్రకారం 2 కిలో వాట్ల రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రాష్ట్రం కూడా ఇచ్చే రాయితీతో కలిపి రూ.80 వేల వరకు సబ్సిడీ అందుతుంది. బీసీ వర్గాలకు అండగా ఉండాలనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
పీఎం సూర్యఘర్ పథకం కింద అదనంగా రూ.20 వేలు సబ్సిడీ !
March 14, 2025
0
Tags