ఇజ్రాయిల్‌ని నాశనం చేస్తాం : ఐఆర్జీసీ జనరల్ ఇబ్రహీం జబ్బారి

Telugu Lo Computer
0


పరేషన్ ట్రూ ప్రామిస్ 3లో భాగంగా ఇజ్రాయిల్‌ని నాశనం చేస్తామని ఇరాన్‌కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జనరల్ ఇబ్రహీం జబ్బారి నుండి ఇజ్రాయిల్‌కి  హెచ్చరికలు వచ్చాయి. ''ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 సరైన సమయంలో, ఖచ్చితత్వంతో ఇజ్రాయిల్‌ని నాశనం చేయడానికి, టెల్ అవీవ్-హైఫాలను నేలమట్టం చేయడానికి నిర్వహిస్తాము'' అని మేజర్ జనరల్ జబ్బారి హెచ్చరించారు. ఈ బెదిరింపులకు ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి గిడియర్ సార్ స్పందించారు. '' యూదు ప్రజలు చరిత్ర నుంచి ఏదైనా నేర్చుకున్నారంటే అది ఇదే. మీ శత్రువు మిమ్మల్ని నానశం చేస్తామని చెబితే నమ్మంది- మేము అందుకు సిద్ధంగా ఉన్నాము'' అని అన్నారు. జబ్బారికి ముందు ఇజ్రాయిల్‌ని మరో ఇద్దరు ఇరాన్ అధికారులు ఇదే విధంగా బెదిరించారు. ఐఆర్జీసీ డిప్యూటీ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీ ఫడవి, ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అమీర్ అలీ హజీజాదే కూడా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3లో భాగంగా ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.




Post a Comment

0Comments

Post a Comment (0)