పాకిస్తాన్‌లో బాంబు పేలి ఐదుగురు మృతి

Telugu Lo Computer
0


వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో తాలిబన్‌ స్కూల్‌లోని మసీదులో శుకవారం పవర్‌ఫుల్‌ బాంబు పేలింది. ఈ బాంబు పేలుడు వల్ల మసీదులో ప్రార్థనలు చేస్తున్న ఐదుగురు మృతి చెందారు. చాలా మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. రంజాన్‌ మాసం ముందు ఈ బాంబు పేలుడు జరిగిందని ఖైబర్‌ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని జిల్లా పోలీసు చీఫ్‌ అబ్దుల్‌ రషీద్‌ తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని ఆయన అన్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ఆప్ఘనిస్తాన్‌తో సంబంధమున్న తాలిబన్‌ ఏ గ్రూపు కూడా దాడికి పాల్పడినట్లు వెల్లడించలేదని మీడియా తెలిపింది.


Post a Comment

0Comments

Post a Comment (0)